ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం బవన పాలెం గ్రామ నివాసి అయిన గొల్లమందల శ్రీనివాసరావు ప్రైవేట్ టీచర్ గా గత పది సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా స్కూల్స్ మూసివేయడంతో, జీవనోపాధి కోసం గ్రామంలో వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కావున ప్రభుత్వం వారు కానీ స్కూల్ యాజమాన్యం వారు తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నాడు.