సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పెద్ద కుమారుడు భార్గవ్ వివాహానికి హాజరు కావాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించారు. సండ్ర, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి శుక్రవారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ను కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. కాగా, అక్టోబర్ 13వ తేదీన రాత్రి హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీవేంకటేశ్వరస్వామి కళ్యాణ మండపంలో వివాహం జరగనుంది.