ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక కోసం సిబ్బంది నిర్వహిస్తున్న సర్వేకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ అన్నారు. శనివారం సత్తుపల్లిలో నిర్వహించిన కౌన్సిల్లో ప్రవేశపెట్టిన పలు తీర్మానాలను కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో కమిషనర్ మందా రవిబాబు, మేనేజర్ మైసా శ్రీనివాస్, కౌన్సిలర్లు ఎస్ కే చాంద్ పాషా, అమరవరపు విజయనిర్మల, కంటే నాగలక్ష్మి, అద్దంకి అనీల్, నాగుల్ మీరా పాల్గొన్నారు.