ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం భవన పాలెం గ్రామంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు స్టేట్ లెవెల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పర్యటించారు. తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలను గ్రామంలో కాలినడకన పర్యటిస్తూ ఇటీవల జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రశంసాపత్రాన్ని అందుకున్న సర్పంచ్ సోడె, రాంబాబు ద్వారా వివరాలు తెలుసుకొని సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఏపిడివొ, ఎమ్డివొ, ఉపాధిహామీ ఎపిఓ టెక్నికల్ అసిస్టెంట్, పీల్డ్ అసిస్టెంట్ వినోద్, నీలాదిరిబాబు, ఉప సర్పంచ్ కర్రీ మోహన్ రావు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.