సింగరేణి: ముళ్ళ కంపలు తొలగింపు
సింగరేణి మండలం స్మశాన వాటికకు వెళ్లే దారిలో దట్టంగా ముళ్ళ పొదలు అలుముకొని వెళ్లడానికి వీలు లేకుండా ఉంది. కారేపల్లి మండలానికి చెందిన, హైదరాబాద్ బిల్ కంపెనీ మేనేజర్ గుగులోత్ రవి ఆర్థిక సహాయంతో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఇమ్మడి తిరుపతిరావు మంగళవారం దగ్గరుండి జేసీబీతో ముళ్లపొదలు తొలగించి మార్గాన్ని సుగమం చేశారు. తమ సమస్య ను పరిష్కరించి నందుకు గ్రామస్తులు ఇమ్మడి తిరుపతిరావు, బెల్ రవిలకు కృతజ్ఞతలు తెలిపారు.