సింగరేణి మండల కేంద్రంలో ఆదివారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ 59వ జయంతి వేడుకలు మాజీ మండల అధ్యక్షుడు కేశగాని బాలకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జై ఎమ్మార్పీఎస్ జై జై ఎమ్మార్పీఎస్, జై మందకృష్ణ జై జై మందకృష్ణ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో కుల పెద్ద అదేర్ల అంజయ్య, రాములు, రామారావు, తదితరులు పాల్గొన్నారు.