సింగరేణి మండలం అప్పాయిగూడెంలో లక్ష్మీ ప్రియ కోటెక్స్ జిన్నింగ్ మిల్ లో సీసీఐ కేంద్రాన్ని సోమవారం ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, మాలోతు రాందాస్ నాయక్ లు ప్రారంభించారు. ప్రారంభోత్సవ రోజు ఎమ్మెల్యేల ఆదేశాలను బేఖాదర్ చేస్తూ రైతుల నడ్డి విరుస్తున్న అధికారుల తీరుతో రైతులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.