వైరా విక్రమ్ భవన్ లో మంగళవారం తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళన సభ ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు. జూన్ 12న తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం ఉద్యమకారుల సమ్మేళన సభను జయప్రదం చేయాలని తెలంగాణ జేఏసీ నాయకులు అర్జున్ రావు, పూర్ణకంటి రామారావు పిలుపునిచ్చారు. ఈ సమ్మేళన సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హాజరవుతారని చెప్పారు.