కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ 1973 అరుణా షాన్‌బాగ్ సంఘటనను ప్రస్తావించారు. పని ప్రదేశాల్లో మహిళల సంఖ్య పెరుగుతున్నారని.. వివక్ష కారణంగా మహిళా డాక్టర్లను టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అరుణా షాన్‌బాగ్‌కు జరిగిన అన్యాయం, వైద్య రంగంలోనే ఘోరమైన ఘటన అని సీజే తన తీర్పు సమయంలో గుర్తు చేశారు.