కోల్‌కతా హత్యాచార ఘటన.. నిందితుడికి 14 రోజుల కస్టడీ

65చూసినవారు
కోల్‌కతా హత్యాచార ఘటన.. నిందితుడికి 14 రోజుల కస్టడీ
కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్య కేసులో ప్రధాన నిందితుడికి న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అతడిని కోల్‌కతాలోని సీల్దా కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు అరెస్టయిన సంజయ్ రాయ్‌ను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని కోర్టు ఆదేశించింది. వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.