భక్తిశ్రద్ధలతో పొలాల అమావాస్య పండుగ

54చూసినవారు
భక్తిశ్రద్ధలతో పొలాల అమావాస్య పండుగ
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పొలాల అమావాస్య పండుగ వేడుకలను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం కొనుగోలు చేసిన మట్టి ఎడ్లను ఇంటి వద్ద ప్రతిష్టించి పూలు, పండ్లు, పత్రిలతో అలంకరించి ఇంట్లో ప్రత్యేకంగా తయారుచేసిన పిండి వంటకాలు నైవేద్యాలుగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరూ ఎల్లకాలం సుఖ సంతోషాలతో బాగుండాలని మొక్కుకున్నారు.

సంబంధిత పోస్ట్