రాష్ట ప్రభుత్వం విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలనే ఉద్దేశ్యం మెస్ చార్జీలను పెంచిందని కేవీపీయస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, డివైఫ్ఐ జిల్లా అధ్యక్షులు గేడం తికనంద్ అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పలు హాస్టల్ లను సందర్శించి విద్యార్థులను పెరిగిన ధరలకు అనుగుణంగా భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు.