కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో సవాతి గ్రామానికి చెందిన శైలజ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంది. ఫుడ్ పాయిజన్కు కారణమైన హెచ్ఎం, వార్డెన్లను సస్పెండ్ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.