కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఇందాని గ్రామంలో శుక్రవారం ప్రమాదవశాత్తు ఛాప్లె ప్రకాష్ ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దగ్దమైంది. శనివారం విషయం తెలుసుకున్న వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుర్నులే నారాయణ ఆధ్వర్యంలో పరిశీలించి ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. నేనున్నా అంటూ ఓదార్చారు. అనంతరం తక్షణ సాయం కింద బాధిత కుటుంబానికి నగదు అందజేశారు.