ఘనంగా పవన్ జన్మదిన వేడుకలు

57చూసినవారు
ఘనంగా పవన్ జన్మదిన వేడుకలు
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మరియాల వినీత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సాయి తేజ, రాహుల్, కార్తీక్, రమేష్, కృష్ణ, రాజశేఖర్, యశ్వంత్ , సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్