అద్వాన్నంగా ఉన్న గ్రామాల రోడ్లు
కౌటాల మండలం ముత్తంపేట్ నుండి పార్ధి, కౌటి, వీరవేల్లి, సాండ్ గాం గ్రామాలకు అనునిత్యం వెళ్లే రోడ్ పరిస్థితి వర్షాలకు విపరీతంగా అద్వాన్నంగా తయారయిందని గ్రామాల ప్రజలు, వాహనదారులు వాపోయారు. వర్షాలు కురుస్తున్నప్పుడు రహదారి నరకంగా ఉంటుందన్నారు. సరిగ్గా కాలి నడకతో కూడా పోలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. అధికారులు స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామాల ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.