ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరు నియోజకవర్గం కౌటాల మండలంలోని గురుడు పెట్ గ్రామంలో కరెంట్ ట్రాన్స్ ఫార్మర్ పై చెట్లు, తీగలు చుట్టుకుని ఉన్నాయి, వీటిని పట్టించుకునే నాధుడే లేడని అక్కడి ప్రజలు వాపోతున్నారు. చిన్న పిల్లలు, అటువైపు పొలాలకి వెళ్ళే వారు తిరుగుతూ ఉంటారు కాబట్టి అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.