అధ్వాన్నంగా ఇంటర్మీడియట్ కళాశాల ఆవరణ

81చూసినవారు
కౌటాల మండలంలోని గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజీ ఆవరణ అధ్వాన్నంగా తయారయ్యిందని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. కురుస్తున్న వర్షాలకు ఆవరణలో వర్షపునీరు నిలువ ఉంటుందని, ఆవరణలో ఓ బావి కూడా ప్రమాదకరంగా వుందని బావిలో వర్షపు మురికి నీరు నిండుగా ఉందన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కళాశాలకు నిధులను మంజూరు చేయాలని ప్రిన్సిపాల్, కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్