రెబ్బెన: వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య
ఓ మహిళ వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రెబ్బెన మండలంలో చోటుచేసుకుంది. రెబ్బెన ఎస్ఐ చంద్రశేఖర్ వివరాల ప్రకారం.. మంచిర్యాలకు చెందిన పుష్ప అనే మహిళతో రాంటెంకి వెంకటేశ్ కు పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీయగా ఇంట్లో వారు పంచాయితీ పెట్టారు. అయినా ఆ మహిళ మాట్లాడాలని వేదించడంతో ఈనెల 24న పురుగుల మందు తాగాడు. ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందిన్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.