నీటి గుంటలో పడి వ్యక్తి మృతి
సిర్పూర్ టి మండల కేంద్రంలోని న్యూ కాలనీకి చెందిన షేక్ హుస్సేన్ (50) అనే వ్యక్తి నీటి కుంటలో పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం రోజువారి కూలి పని చేసుకుని సాయంత్రం ఇంటికి వెళ్తున్న క్రమంలో చీకటిగా ఉండటంతో నీటి గుంటలో పడి మృతి చెందినట్లుగా తెలిపారు. మృతుడు చెన్నూరు పట్టణం నుంచి తన సోదరి ఇంటి వద్ద సిర్పూర్ వచ్చి కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారన్నారు.