కాగజ్‌నగర్ మండలం రాస్ పల్లి గ్రామ శివారులోని పెద్ద వాగు వద్ద నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. సీఐ రాణా ప్రతాప్ వివరాల ప్రకారం. ఈజ్గాం పోలీస్ స్టేషన్ పరిధిలో కోడిపందాలు నిర్వహిస్తున్న స్థావరంపై దాడి చేశామన్నారు. దొరికిన వారి వద్ద నుంచి 4 కోడిపుంజులు, రూ. 3020/-నగదు, 10 బైక్స్, 6 మొబైల్స్ స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించామన్నారు.