విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం కౌటాల మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. 24 గంటల విద్యుత్ అందించాలని. విద్యుత్ శాఖ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ. కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతున్నామని, 24గంటల కరెంటు అందించాలని కోరారు. వెంటనే కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాతో రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచాయి.