బెజ్జూర్: కాంగ్రెస్‌లో చేరిన ఉద్యమ నాయకులు

83చూసినవారు
బెజ్జూర్: కాంగ్రెస్‌లో చేరిన ఉద్యమ నాయకులు
బెజ్జూర్ మండలం మర్తీడి గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మాజీ సర్పంచ్ ఉమ్మేర లింగయ్యతో పాటు సులుగుపల్లి గ్రామానికి చెందిన గిరిజన నాయకుడు సోయం చిన్నయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం కాగజ్‌నగర్‌లోని ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విట్టల్ నివాసంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ బెల్లయ్య నాయక్ తేజావత్, జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్