చింతలమానేపల్లి మండలం గూడెం వైన్ షాపులో అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారని సోమవారం మద్యం ప్రియులు వాపోయారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారని సిబ్బందిని ప్రశ్నించగా వారు యజమానిని అడగమని నిర్లక్ష్యంగా జవాబు చెప్పినట్లుగా బాధితుడు తెలిపాడు. మద్యాన్ని అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్నారని పలుమార్లు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.