కాగజ్‌నగర్ పట్టణంలోని ఫాతిమా చర్చిలో సోమవారం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీ క్రిస్మస్ వేడుకల్లో సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి ఆయన కేక్ కట్ చేసి పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో చర్చి ఫాథర్, మాజీ కౌన్సిలర్ మోనీ, బీజేపి నాయకులు, విద్యార్థులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.