తొలి అడుగు సేవా సంస్థ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ

1784చూసినవారు
తొలి అడుగు సేవా సంస్థ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ
అన్నపురెడ్డి పల్లి మండలం కట్టుగూడెం గ్రామంలో ఎర్రగుంట జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు తొలి అడుగు స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని ప్రజలకు, గత రెండు వారాల నుండి ఈ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, నిత్యావసర సరుకులు పంచి పెట్టడం జరిగింది.

దీనిలో భాగంగా శుక్రవారం ఒరిస్సా నుంచి వచ్చిన వలస కూలీలు ఇబ్బంది పడుతున్నారని, సుమారు 18 ఒరిస్సా కుటుంబాల వారికి కట్టుగూడెంలో, ఐదు వేల రూపాయల సరుకులు ఒక క్వింటా సన్నబియ్యం తొలి అడుగు సభ్యులు, అన్నపురెడ్డిపల్లి ఎస్సై సుమన్ ఆధ్వర్యంలో వీటిని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సుమన్ మాట్లాడుతూ తొలి అడుగు స్వచ్ఛంద సభ్యులను ప్రశంసిస్తూ, లాక్ డౌన్ ప్రాముఖ్యతను వివరిస్తూ పోలీసు వారి సూచనలు పాటించాలని ప్రజలకు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్