Oct 06, 2024, 06:10 IST/
రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇస్తుంది: మోదీ (వీడియో)
Oct 06, 2024, 06:10 IST
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేసిన రైతు రుణమాఫీ పథకంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. మహారాష్ట్రలోని వాషిం జిల్లా, థానేలో మోదీ శనివారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగమయ్యాయని ఆరోపించారు. రుణమాఫీపై ఆ పార్టీ తప్పుడు హామీలు ఇస్తుందని అన్నారు. తెలంగాణ రైతులు ఇంకా రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు.