దేవర సక్సెస్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాస్ స్పీచ్ తో అదరగొట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన ఈ ఈవెంట్ లో తారక్ 'హరి' అనే వ్యక్తిని ప్రముఖంగా ప్రస్తావించారు. ఎవరు ఏమనుకున్నా సరే తమకి హరి ఉన్నాడు అని, హరి తనకు, కళ్యాణ్ రామ్ అన్నకి ఎన్టీఆర్ ఆర్ట్స్ విషయంలో ఎంతో అండగా ఉన్నాడని తెలిపాడు. ఈ హరి ఎవరంటే.. కళ్యాణ్ రామ్ భార్య తమ్ముడు. అయితే అతను వచ్చాకే తనకు, ఫ్యాన్స్ కు మధ్య అంతరం పెరిగిందనే చర్చ నడుస్తుండటంతో NTR ఇలా స్పందించారు.