భద్రాచలం: 210 కిలోల గంజాయి పట్టివేత

53చూసినవారు
భద్రాచలంలోని కూనవరం రోడ్డుపై కారులో తరలిస్తున్న 210 కిలోల గంజాయిని ఆబ్కారీ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం పట్టుకున్నారు. ఏపీలోని డొంకరాయి నుంచి పుణెకు గంజాయి తరలిస్తున్నట్లు వెల్లడించారు. పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు పుణెకు చెందిన ఎ. పండరీనాథ్, దత్తాత్రేయగా గుర్తించి కేసు నమోదు చేశారు. తనిఖీల్లో అధికారులు గణేశ్, జానయ్య, రహీమున్నీసా బేగం, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్