డ్రైనేజీ కాలువ లేక ఇబ్బంది

71చూసినవారు
భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన ఉన్న వీధిలో డ్రైనేజీ కాలువలు ఇబ్బంది పడుతున్నారని బుధవారం స్థానికులు తెలిపారు. స్థానికంగా నివసిస్తున్న కాలనీవాసుల ఇళ్లలో నుంచి వస్తున్న మురికినీళ్లు రోడ్డుపై చేరుతుందన్నారు. దీనివల్ల దోమలు పెరిగి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయన్నారు. కావున స్థానిక అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ కాలువను నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్