వాగు దాటి వెళ్లి వైద్య శిబిరం ఏర్పాటు

71చూసినవారు
వాజేడు అటవీ ప్రాంతంలోని పెనుగోలు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించేందుకు బుధవారం వైద్య సిబ్బంది 18 కి. మీ నడిచారు. ఆ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేదు. అయినప్పటికీ మార్గమధ్యలో ఎత్తైన గుట్టలు ఎక్కి, పీకల్లోతు వాగును దాటి వైద్య శిబిరం నిర్వహించారు. అనంతరం గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందుగానే హెల్త్ క్యాంప్ నిర్వహించామని డాక్టర్ తెలిపారు. వైద్య సిబ్బందిపై స్థానికులు ప్రశంసలు కురిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్