ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపుర్ జిల్లాలోని బస్తర్ బెటాలియన్కు చెందిన జవాన్ కమలేష్ హేమ్లా(26) గురువారం పిడుగుపడి మృతి చెందాడు. బస్తర్ బెటాలియన్ ఏరియా డామినేషన్లో భాగంగా భద్రతా బలగాలు బయలు దేరాయి. ఆ సమయంలో ఉరుములు, కమలేష్ హేమ్లా మెరుపులతో భారీ వర్షం కురిసింది. పిడుగుపడడంతో కమలేష్ హేమ్లా తీవ్రగాయాల పాలై అపస్మారకస్థితికి చేరుకున్నాడు. వెంటనే బీజాపుర్ జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందాడు.