చంద్రుగొండ: చెరువులో మునిగి వ్యక్తి మృతి
చంద్రుగొండ మండలం గానుగపాడు గ్రామంలో పద్దం చంటి(29) చెరువులో మునిగి సోమవారం మృత్యు వాత పడ్డాడు. గ్రామంలోని నల్లచెరువులో చేపలవేటకు మరో ఇద్దరితో కలిసి వెళ్లిన చంటి నీటిలోకి దిగాడు. లోతైన ప్రదేశంలోకి వెళ్లడంతో చంటి మునిగిపోయి మృతి చెందాడు. తోటివారి సమాచారంతో గ్రామస్థులు, కుటుంబీకులు మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.