ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
చండ్రుగొండ మండలంలోని అయ్యన్నపాలెం వద్ద మంగళవారం రాత్రి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ గంజి స్వప్న తెలిపారు. ఎదుళ్లవాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో దాడి చేసి పట్టుకున్నామని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు.