చెంచుపల్లి: ఇది పల్లె ప్రకృతి వనమా.. లేక పాముల వనమా

78చూసినవారు
చెంచుపల్లి: ఇది పల్లె ప్రకృతి వనమా.. లేక పాముల వనమా
చెంచుపల్లి మండలం బాబు క్యాంప్ పంచాయతీలో గల రెండు పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయి. అందులో గల కాలుష్య నియంత్రణ చెట్లను కొట్టివేసి ఆ చెత్తను అందులోనే ఉంచటం వల్ల ఒకే వారంలో నాలుగు పాములు కలకలం రేపాయి. ఆ పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ ముందుకు శుక్రవారం రాత్రి దాదాపు 6 అడుగుల కొండ చిలువ రావటం చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికైనా అధికారులు కదిలి పల్లె ప్రకృతి వననీ పరిశుభ్రం చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్