మణుగూరు: కరెంట్ షాక్ తో ఇద్దరు మృతి
కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండల కేంద్రంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. మండలంలోని ప్రైవేటు హై స్కూల్లో విద్యుత్ ఘాతంతో ఇద్దరు వాచ్ మెన్లు మృతి చెందారు. విద్యుత్ మెయిన్ తీగలకు పాఠశాలలో ఉన్న ఇనుప స్తంభం తీస్తుంగా.. విద్యుత్ తీగలకు తగలడంతో మణుగూరుకు చెందిన ఉపేందర్, రత్నం వాచ్ మెన్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి మృతితో దుఃఖసాగరంలో మునిగారు.