మణుగూరులో గుండెపోటుతో భార్యాభర్తల మృతి
మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఆ దంపతులు చావులోనూ ఒకరినొకరు వీడలేదు. భర్త కన్నుమూసిన క్షణాల్లోనే భార్య కూడా విగతజీవిలా మారిన ఘటన మణుగూరులో జరిగింది. స్థానికుల వివరాలిలా.. సుందరయ్యనగర్‌కు చెందిన కొమ్ము సోమయ్య పొలంలో పనిచేస్తూ గుండెపోటుతో మృతిచెందాడు. విషయం తెలిసి అతని భార్య వెంకటమ్మ కూడా గుండెపోటుతో కుప్పకూలింది. భార్యభర్తల మృతితో మణుగూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.