పెద్దవాగు ప్రాజెక్ట్ కి భారీగా చేరిన వరద నీరు

84చూసినవారు
గత మూడు రోజులుగా వాతావరణం మేఘావృతమై సన్నని జల్లులు పడటంతో అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి పంచాయితీ పరిధిలోని పెద్దవాగు ప్రాజెక్ట్ లో సోమవారం జలకల సంతరించుకుంది. ఈ వర్షానికి అశ్వారావుపేట మండలాల్లోని పలు వాగులు, కాలువలు పొంగి పొర్లడంతో పెద్దవాగు ప్రాజెక్ట్ కి భారీగా వరద నీరు చేరింది. రాత్రి నుండి ఇప్పటి వరకు అశ్వారావుపేలో 24. 8 మి. మీ, దమ్మపేటలో 20. 0 మి. మీ వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్