స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్నికల విజయ దుందుభి మోగిస్తుందని బీఆర్ఎస్ మణుగూరు మండల కన్వీనర్ కుర్రి నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం బుగ్గ గ్రామపంచాయతీ బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బుగ్గ గ్రామానికి మిషన్ భగీరథ స్కీంలో ఇంటింటికీ మంచినీరు అందించిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు.