ఇల్లందు మండలంలోని సుదిమళ్ల గ్రామపంచాయతీ కొత్తూరులో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్స్ ముగిశాయి. మంగళవారం ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్ఎస్ మండల నాయకుడు ఇర్ప కాంతారావు బహుమతులు అందజేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సన్మార్గంలో నడవాలని ఈ సందర్భంగా వారికి కాంతారావు సూచించారు.