ప్రజలు అనారోగ్యంబారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

66చూసినవారు
ప్రజలు అనారోగ్యంబారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
గార్ల, వర్షాకాలంలో ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. గార్ల మండల కేంద్రంలో ఆకస్మిక పర్యటన చేసి కమ్యూనిటీ హెల్త్ సెంటర్, జిల్లా పరిషత్, బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలను, అంగన్వాడి సెంటర్, గార్ల రాంపురం చెక్ డ్యాం, ముల్కనూర్ పి. హెచ్. సి ని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు.

సంబంధిత పోస్ట్