యూపీలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. హత్రాస్ జిల్లా ముర్సాన్ పీఎస్ పరిధిలోని పటాఖాస్కు చెందిన వృద్ధ దంపతులపై గుర్తుతెలియని దుండగులు ఆదివారం దాడిచేశారు. గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు. దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వాళ్ల కుటుంబసభ్యులు రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు న్యాయం చేస్తామని హామి ఇచ్చి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.