AP: శాసనసభలో తనను ప్రతిపక్ష నేతగా గుర్తించకపోతే సభకు వెళ్లబోనని జగన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే మండలి సమావేశాలకు మాత్రం వైసీపీ సభ్యులు హాజరుకానున్నారు. మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఉండడంతో పాటు అక్కడ సంఖ్యాబలం పరంగా ఆధిక్యత ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే దానిపై ఆదివారం స్పష్టత రానుంది.