దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు చౌదరీ మతీన్ అహ్మాద్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఆదివారం ఆయన అధికార ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆప్‌లో మతీన్ చేరికను పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాదిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో సీనియర్ నేత పార్టీని వీడటంతో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది.