ఎల్‌ఐసీ లాభం రూ.13,763 కోట్లు

72చూసినవారు
ఎల్‌ఐసీ లాభం రూ.13,763 కోట్లు
ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ త్రైమాసిక ఫలితాలను తాజాగా ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఈ సంస్థ రూ.13,763 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.13,428 కోట్లతో పోలిస్తే నికర లాభంలో 2 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ.2,00,185 కోట్ల నుంచి రూ.2,50,923 కోట్లకు పెరిగినట్లు ఎల్‌ఐసీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

ట్యాగ్స్ :