చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన లింకన్

71చూసినవారు
చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన లింకన్
అబ్రహం లింకన్ అమెరికా 16వ అధ్యక్షుడు. అతను 1809 ఫిబ్రవరి 12న పేద కుటుంబంలో జన్మించాడు. లింకన్ చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. ఆర్థిక కష్టాల కారణంగా తరచూ వలసలు వెళ్లే కుటుంబంలో పెరగడంతో పెద్దగా చదువుకోలేదు. తల్లి మరణం తర్వాత తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. అయితే సవతి తల్లి లింకన్‌పై ఎంతగానో వాత్సల్యం పెంచుకుంది. సొంతబిడ్డలాగా సాకేది. ఆమె పెంపకంలోనే లింకన్ నీతి, నిజాయతీలను బాగా ఒంటబట్టించుకున్నాడు.

సంబంధిత పోస్ట్