చేపల వేటకు రెండు నెలల నిషేధం

72చూసినవారు
చేపల వేటకు రెండు నెలల నిషేధం
సముద్రంలో చేపల వేటపై ఇవాళ్టి నుంచి నిషేధం అమలులోకి వచ్చింది. జూన్ 14 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులకు రెండు నెలల పాటు విరామం లభించనుంది. మత్స్య సంపద పెరిగే కాలం కావడంతో 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటపై ఏటా ప్రభుత్వం నిషేధం అమలు చేస్తోంది. ఈ విరామ సమయంలో కుటుంబానికి రూ.10 వేల చొప్పున మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది.

సంబంధిత పోస్ట్