మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సును ఓ లారీ ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మరణించాడు. సుమారు 25 మంది స్టూడెంట్స్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.