AP: కోడి పందేల కేసులో గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్యను పోలీసులు పట్టుకున్నారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం రామవరం గ్రామంలో కోడి పందేలు నిర్వహిస్తుండగా పట్టుకున్నారు. రూ.2,07,000, ఎనిమిది కోళ్లు, 20 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే చింతలపూడితో పాటు మరో 29 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.