ప్రేమ పెళ్లి.. వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య

66చూసినవారు
ప్రేమ పెళ్లి.. వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య
TG: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే వేధించడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. సూర్యాపేట(D) మద్దిరాల(M)కు చెందిన మనీషా(24) తుంగతుర్తి మండలానికి చెందిన పులిగుజ్జ సంపత్‌ గతేడాది ఫిబ్రవరి 14న ప్రేమ పెళ్లి చేసుకున్నారు. HYD రామంతాపూర్‌లో ఉంటూ సంపత్‌ ఓ ఆస్పత్రిలో LTగా పని చేస్తున్నాడు. కొన్నిరోజులుగా సంపత్, అతడి సమీప బంధువు భాషబోయిన మున్నిత కట్నం తేవాలంటూ మనీషాను వేధిస్తున్నారు. వీరి వేధింపులు భరించలేక మనీషా శనివారం అర్ధరాత్రి ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది.

సంబంధిత పోస్ట్